Monday, September 25, 2023

హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు.. అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ సన్మానం

బాన్సువాడ, (బిచ్కుంద) ప్రభ న్యూస్ : హజ్ యాత్రకు వెళ్లే భక్తులను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండే సన్మానించారు. కామారెడ్డి జిల్లా పెద్ద ఎక్ లారా చెందిన జాఫర్ కుటుంబ సభ్యులను ఆదివారం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని .. అల్లా ఆశీస్సులు తమ నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకోవాల‌ని సూచించారు. యాత్రకు వెళ్లి క్షేమంగా రావాలని ఆయన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎక్లారా జాఫర్ .. కుటుంబ సభ్యులు, జుక్కల్ నియోజకవర్గం మైనార్టీ కోఆప్షన్ సభ్యులు జావిద్ హైమద్ సిద్ధికి, జాఫర్ బాయ్, మోహిన్, రహిమాన్, ఇస్మాయిల్, నిజాముద్దీన్ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement