Thursday, April 25, 2024

కేటీఆర్‌ కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్..

బోధ‌న్ – మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్‌ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్‌ చేశారు. . హథ్ సే హథ్ జోడో యాత్ర లో బాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో పర్యటించిన ఆయన ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ ను సందర్శించారు. అనంత‌రం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, వందల టిఎంసి లో నీరు సముద్రంలో కలుస్తున్నందున ఇది గమనించి హైదరాబాద్ కు తాగునీరు, రంగారెడ్డి వరకు సాగునీరు ఎత్తిపోతల పథకం ద్వారా వైఎస్ ఆర్ 2008 లో 38 వేల కోట్ల రూపాయల తో 16 లక్షల ఎకరాలకు సాగునీరు జలయజ్ఞం ద్వారా అందించాలనే ప్రధాన లక్ష్యం లో భాగంగా నిజామాబాద్ జిల్లా లో కాళేశ్వరం 20,21,22 ప్యాకేజీ పనులు ప్రారంభించారన్నారు.. వాటినే కమీషన్ లు వచ్చే విదంగా రిడిజైన చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా పనుల్లేవన్నారు. ఈ ప్యాకేజీ పనులు కాంగ్రెస్ హయాంలో లోనే 70 శాతం పూర్తి కాగా మిగిలిన ప‌నులు అలాగే ఉన్నాయ‌న్నారు..

సిరిసిల్ల లో కొడుకు మంత్రి, ఇక్కడ ఎంఎల్సి కవిత కుటుంబం కలిసి కీలక పైసలచ్చే శాఖలు మీ వద్ద ఉంచుకొని దోపిడీ కి పాల్పడుతున్నారు.కొత్త సంవత్సరం కొత్త గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంద‌ని, వేంటనే మిగిలిన పథకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం గా వివరించారు. అలాగే కవితపై ఈడీ విచారణ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ ది మిత్రభేదమంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, అంజన్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, తాహెర్ బిన్ హందాన్, బిళ్ళ రాంమోహన్, కేశవ్ వేణు, గంగాధర్ గౌడ్, గైని పోచయ్య, రాధ కిషన్ గౌడ్ ,నీరడి సాయిలు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement