Sunday, October 13, 2024

ప్రజావాణి.. తాత్కాలిక వాయిదా

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదావేసినట్లు నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడం, ఇదే అంశంపై సోమవారం ఉదయం 10.00 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న సమీక్షలో జిల్లా అధికారులు పాల్గొనాల్సి ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement