Friday, April 19, 2024

మా భూమి మాకు ఇప్పించండి సారూ.. కలెక్టర్ కు వినతి..

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని తారక రామ్ నగర్ (తారక రామారావు క్యాంపు)లో నాకు సంబంధించిన స్థలాన్ని ఒక వర్గం వారు స్మశాన వాటిక కోసం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని బాధితుడు యశ్వంత్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కోరారు. నిజాంబాద్ నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో తారక రామ్ నగర్ స్థలంలో భూమి విషయ మై న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 1965 సంవత్సరం నుండి (వ్యవసాయ) పట్టా భూమి, మా నాన్న కొనుగోలు చేశారని యశ్వంత్ తెలిపారు. కాలనీలో ఒక వర్గం వారు నాకు సంబంధించిన స్థలంలో శవాలను పాతీ పెడుతున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీసులు, ఆర్ఐతో మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. తారక నగర్ కు చెందిన ప్రజలతో అధికారులు మమేకమై పట్టా పొలమైన టువంటి (పట్టా భూమి అయినటువంటి) మా పొలంలో శవాలను ఖననం చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో 2015 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ యోగితారాణ ఈ స్థలం పట్టా భూమి అయినటువంటి స్థలంలో ఇతరులు ఎలా వెళ్తారని, భూమి ఏమయిన ప్రభుత్వం స్థలం కాదుగా, ప్రభుత్వ స్థలం అయితే ఖననం చేసుకునే విధంగా ఉంటుంది అని చెప్పినప్పటికీ అప్పటి నుండి ఎవరు రాకుండా ఉండిపోయారు. కాని ఇటీవలే మళ్లీ ఆ సమస్య పునరావృతం అయిందని పేర్కొన్నారు. అధికారులు తారక నగర్ ప్రజలకు సహకరిస్తూ మా సొంత స్థలంలో శవాలను పాతి పెడుతున్నారని వెల్లడించారు. కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ చేపట్టి మా భూమి మాకు ఇప్పించి ఆదుకోవాలని యశ్వంత్ కలెక్టర్ ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement