Wednesday, November 29, 2023

ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్..

నిజామాబాద్: ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ళ నాన్న ఒక జోకర్ అని, అరవింద్ చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ది ఉద్య‌మాలు చేసిన కుటుంబం (ఫైటర్స్ ఫ్యామిలీ) అని, అరవింద్ కుటుంబం చీటర్స్ ఫ్యామిలీ అని అన్నారు. అర‌విందు ను చెప్పుతో కొట్టడం అనేది చిన్న మాట అని, కవితమ్మ చాలా చిన్న మాట అన్నారన్నారు. అర‌వింద్ క‌డ‌బ్దార్ మ‌రో సారి కేసీఆర్ కుటుంబం జోలికి వ‌స్తే, త‌ప్పుగా మాట్లాడితే ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉరికించి కొడతానని హెచ్చ‌రించారు. ఆర్మూర్ ప్రజలు అరవింద్‌ను ఓడించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కరెంటు గురించి మాట్లాడే అరవింద్ ఒకసారి కరెంట్ వైర్లను పట్టుకుంటే తెలుస్తుందన్నారు. క్షమించమని అరవింద్ వేడుకునే వరకు వెంటాడుతూనే ఉంటామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement