Thursday, March 28, 2024

పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలి..

సిరికొండ, మార్చి 27 ( ప్రభన్యూస్ ) : ప్రకృతి వైపరీత్యానికి పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్ చార్జి డాక్టర్ భూపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో వడగళ్ల‌ వర్షానికి దెబ్బతిన్న వరి పంటను సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల‌తో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న విషయాన్ని భూపతిరెడ్డి గుర్తు చేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం ఎందుకు చెల్లించలేదని ఆయన నిలదీశారు. వరి పంట సాగు చేయడానికి ఎకరాన రూ.35 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. వరి ధాన్యం అమ్ముకుంటే ఎకరాన రూ.60 వేల వరకు రైతులు లబ్ధిపొందేవారు. కానీ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం తరపున ఎకరాన రూ.10 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంత వరకు సబబు రూ.10 వేలు ఏ మూలకు సరిపోవు ఎకరాన రూ.50 వేలు రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టపరిహారం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం అంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ నష్టపోయిన పంటల కోసం నష్టపరిహారం కోరుతు కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపేది లేదని అంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నారని ఆయన ధ్వజమేత్తాడు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, చందర్ నాయక్,జిల్లా నాయకులు బాలరాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్, జిల్లా బిసి సెల్ సెక్రెటరీ సంతోష్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్, కాంగ్రెస్ నాయకులు కొండూర్ సురేష్, బన్నాజీ, సామెల్, నర్సింగ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement