Monday, October 7, 2024

అడ‌విపందుల కోసం కంచె వేస్తే.. కరెంట్ తీగ తగిలి రైతు మృతి!

నాగిరెడ్డిపేట, (ప్ర‌భ న్యూస్‌) : అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తీగకు తగిలి రైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జ‌రిగింది. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారెడ్డి గ్రామానికి చెందినా ఉబ్బు సాయిలు (48) ఇద్దరు సంతానం శనివారం కూలి పనికి వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో పొలానికి బోరు వేసి వస్తానని చెప్పి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఆదివారం భార్య పోచవ్వ పొలానికి వెళ్లి చూడగా తన వ్యవసాయ భూమిలో అడవి పందుల కోసం కరెంట్ తీగ ఉంది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళగా వైరు తగిలి కరెంటు షాక్ తో మృతి చెందడం జరిగిందని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement