Thursday, April 18, 2024

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు : ఏసీపీ కిరణ్ కుమార్

బోధన్ : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ఉద్యోగులను నియామకాలు చేపట్టనున్నారు. అట్టి ఉద్యోగాలకు బోధన్ డివిజన్ పరిధిలోని పలువురు నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. బోధన్ ప్రాంతంలోని పలువురు పోలీస్ శాఖ చేపట్టిన మానసిక పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు. తుది పరీక్షలు పోలీస్ శాఖ చేపట్టనుంది. అట్టి పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది పోలీస్ ఉద్యోగాలు పొందాల్సి ఉంటుంది. పరీక్షలు రాసే యువకులు శ్రద్ధాసక్తులను చూపి పరీక్షల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగాలు పొందాలని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ యువకులకు సూచించారు. బోధన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 45 మందికి మార్క్ టెస్ట్ పరీక్షలను నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొనేవారు ఒత్తిడికి లోను కాకుండా సాఫీగా పరీక్షలను రాస్తే ఉద్యోగాలు పొందవచ్చని సూచించారు. ఉపాధి పొందడంతో పాటు ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి, పోలీస్ శాఖ పేరు ప్రతిష్టలు తేవాలని ఏసిపి తన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ ప్రేమ్ కుమార్, రూరల్ ఎస్సై సందీప్ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement