Sunday, October 6, 2024

NZB: సీఎంఆర్ వస్త్రాలయం మరో అద్భుతం…

ఇందూర్ లో సందడి చేసిన సినీ తారలు..
ప్రముఖ సినీహీరో రామ్… సినీతార కుమారి పాయల్ రాజ్ పూత్ లు..
సెల్ఫీలతో పోటీపడిన అభిమానులు…
సినీ తారల చిత్రాలను సెల్ ఫోన్ లో బందిస్తూ..సందడి…
అట్టహాసంగా ప్రారంభమైన కానున్న సీఎంఆర్ వస్త్రాలయం..
నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రభ న్యూస్) : మహిళలకు ప్రత్యేక డిజైన్లలో సరసమైన ధరలతో అన్ని రకాల రంగులతో వస్త్రాలను ఏర్పాటు చేసిన సిఎంఆర్ వస్త్రాలయం మరో అద్భుత ప్రపంచమని సినీ తార పాయల్ రాజ్ పుత్ అన్నా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సినీ తారలు సంద డి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రా లలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. టెక్స్టైల్స్ & జ్యూయలర్స్ ప్రైవేట్ లిమి టెడ్, సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభించారు.

నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్ వద్ద సర్వాంగా సుందరంగా రూపుదిద్దుకున్న సీఎంఆర్ వస్త్రాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మె ల్యే ధనాపాల్ సూర్యనారాయణ నిజామాబాద్, నగర మేయర్ దండు నీతు కిరణ్ ,45వ డివిజన్ కార్పొరేటర్ – ఆకుల హేమలత ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎంఆర్ వస్త్రాల యాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ సినీ హీరో రామ్ పోతినేని, ప్రముఖ సినీతార కుమారి పాయల్ రాజ్ పూత్ లు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో సందడి చేశారు.

సెల్ఫీలతో పోటీ పడ్డ అభిమానులు..
సీఎంఆర్ వస్త్రాలయ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ తారల రాకతో ఇందూర్ సందడి మయమైంది. సినీ తారల చిత్రాలను అభిమా నులు సెల్ఫోన్లో బంధిస్తూ…… హీరో హీరోయిన్ల తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీపడ్డారు. సినీ తారలను చూడడానికి సిఎంఆర్ షో రూం కి తండోపదండా లుగా ప్రజలు తరలివచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement