Sunday, June 4, 2023

గంగరమందలో చిరుత కలకలం

మాక్లూర్ : గంగరమంద గ్రామ సమీపంలో గురువారం చిరుత పిల్లుల సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఉదయం పొలాల్లోకి వెళ్లిన గ్రామస్తులకు అటువైపు పరిగెత్తుతూ కనిపించిన చిరుత పిల్లల దృశ్యాలను కళ్లారా చూసిన కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా రికార్డ్ చేశారు. దీంతో ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అశోక్, శ్రీనివాస్ లు పరిసర ప్రాంతాలను సందర్శించారు. చిరుతల కాలి ముద్రల కోసం అన్వేషించారు. కానీ స్పష్టమైన ఆనవాళ్లు లభించలేదు. అయినా ఇటువైపు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా రాకుండా తోడుగా వెళ్లాలని స్థానికులకు సూచించారు. ఈ పరిణామంతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement