Thursday, October 3, 2024

NZB | క్లాత్ షోరూమ్‌కు బల్దియా నోటీసులు..

నిజామాబాద్, ప్రతినిధి (ప్రభ న్యూస్) : కార్పొరేషన్ నిబంధనలను తుంగలో తొక్కి ఇరుకు రోడ్డులో బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టిన క్లాత్ షోరూంకి బల్దియా నోటీసులు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా భవన నిర్మాణ పనులు కొనసాగి… పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి రూపుదిద్దుకుంది.

కానీ, ఇప్పటివరకు కార్పొ రేషన్ తొంగి చూడలేదు. నిబంధనలు పాతర వేసి హంగు ఆర్భాటంగా ప్రారంభానికి సిద్ధమైన క్లాత్ షోరూం బాగోతాన్ని ఆంధ్ర ప్రభ దిన పత్రికలో ప్రచురితమైతేనే కధనాలతోనే కార్పొరేషన్ మొద్దు నిద్రవీడింది. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వస్త్రా షోరూం నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. కార్పొరేషన్ నోటీసులు వరకు మాత్రమే సరిపెడుతుందా…. చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement