Tuesday, April 23, 2024

రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపికే అధికారం – ఎంపి అర‌వింద్

బోధ‌న్ – రాబోయే రోజుల‌లో తెలంగాణ‌లో అధికారం బిజెపిదేన‌ని ఆ పార్టీ ఎంపి ధ‌ర్మ‌పురి అర‌వింద్ ధీమా వ్య‌క్తం చేశారు..
నిజామాబాద్ జిల్లా బోధనలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయం పనులను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ముందుగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ శివాజీ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేశారు. అనంతరం . అనంతరం బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ మేడపాటి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యమైన వస్తువులను వాడుతున్నారని సకాలంలో భవన నిర్మాణ పనులు పూర్తిచేసి అద్దె అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కరోనా సమయంలో ప్రపంచాన్ని టీకా తో ఆదుకున్న ఘనత కేంద్రానిదేనని, 70 దేశాలకు కరోనా టీకా ను అందిచిన ఘనత ప్రధాని మోడీ కే దక్కింద‌ని పేర్కొన్నారు.. 140 కోట్ల ప్రజలను ప్రధాని మోడీ అన్ని విధాలా ఆదుకుంటుంటుంటే సీఎం కెసిఆర్ మాత్రం తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.. బి అర్ ఎస్ ప్రభుత్వం అంతా స్కాముల మయమంటూ విరుచుకుప‌డ్డారు.. 4 కోట్ల ప్రజలను 4 కుటుంబ సభ్యులు పాలిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.


కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయింద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో బి అర్ ఎస్ నీ ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు…రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే
రాష్ట్ర సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర పథకాలు అమలు చేస్తామంటూ అర‌వింద్ హామీ ఇచ్చారు..
బోధన్ – బీదర్ రైల్వే లైన్ సర్వే కి మరిన్ని నిధులు కేటాయించామ‌ని గుర్తు చేశారు..21 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధనకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో 400 మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నామని . భ‌వన నిర్మాణ పనులు పూర్తయితే బోధన్ ప్రాంత వాసులకు 800 మంది విద్యార్థులు విద్యాబోధన అందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement