Wednesday, March 27, 2024

వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి : మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్ : తెలంగాణలో సాగును బాగు చేశామ‌ని, వ్య‌వ‌సాయానికి సాంకేతిక‌త‌ను జోడించి రైతులు లాభాలు గ‌డించాల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఐదు జిల్లాల రైతులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వ‌హించారు. వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే.. ఏ విధంగా అభివృద్ధి సాధించవచ్చో అనే అంశం పై సదస్సులో చ‌ర్చించారు. తెలంగాణలో సాగును బాగు చేశాం, వ్యవసాయం పండుగ చేశాం, 66 లక్షల మంది రైతుల కు 65 వేల కోట్లు ఖాతాలో వేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఉచితంగా 24 గంటలు విద్యుత్ అందించే దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రైతు భీమా ద్వారా 90 వేల రైతు కుటుంబాలను ఆదుకున్నాం, మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను జీవం పోశాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలిసీ తెలియక కొందరు మాట్లాడుతున్నార‌న్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో… దేశంలో మూడో స్థానం తెలంగాణ రాష్ట్రానిది అన్నారు. తెలంగాణలో 5 రకాల విప్లవం రాబోతుంది.. హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, (మాంస ఉత్పత్తి.) శ్వేత విప్లవం, ఎల్లో విప్లవం ఆయిల్ ఫామ్ రేవాల్యూషన్ అన్నారు. ఐదు రకాల విప్లవాలతో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. కొత్త తరం యువకులు వ్యవసాయం చేసే అవకాశం ఉంద‌న్నారు. రాష్ట్రంలో 10వేల ఎకరాల్లో, 16 ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నాం అన్నారు. ప్రభుత్వం రాయితీ ఇచ్చి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టిస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement