Monday, June 5, 2023

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

నాగిరెడ్డిపేట్ : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం గ్రామానికి చెందిన బెస్త ప్రవీణ్ వయసు (25) ఆదివారం సాయంత్రం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. తెప్పపై కూర్చొని వలవేస్తుండగా ప్రమాదవశాత్తు తిప్ప పై నుండి చెరువులో పడడంతో చేతులకు, కాళ్లకు వల చుట్టుకోవడంతో ఈద‌డానికి అవకాశంలేక నీటమునిగి మృతి చెందాడు. తల్లి దేవవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement