Sunday, February 5, 2023

నాటు తుపాకీ పేలి.. ఒక‌రు మృతి

నాటు తుపాకీ పేలి ఒక‌రు మృతిచెందిన ఘ‌ట‌న‌ కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. తూమ్‌పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు సిరికొండ మండలం తూమ్‌పల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. వేట నుంచి తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు తపంచా పేలడంతో రావోజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement