Saturday, October 5, 2024

Nizamabad -తగ్గేదేలే – పేకాట రాణిల అరెస్ట్

నిజా మాబాద్ క్రైమ్ సెప్టెంబర్ (ప్రభ న్యూస్)24:పురుషులకు దీటుగా మహిళలు సైతం తాము ఏమాత్రం తగ్గేదేలే అంటూ పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయబాబు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

వివరాలు ఇలా ఉన్నాయి… నిజామాబాద్ నగరంలోని సరస్వతీ నగర్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాల్గవ అంతస్తులో బుద్ధినేని గోదాదేవి ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఒకటవ టౌన్ పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేసి వారి నుండి 5 సెల్ ఫోన్లు, 15,100 రూ. నగదుని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయబాబు వెల్లడించారు. పట్టుబడిన వారిలో వైద్యుల సతీమణులు ఉండడంపై జిల్లాలో చర్చనీయాంశమైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement