Thursday, April 25, 2024

క్రీడల్లో ప్రపంచస్థాయి ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ బిడ్డలు.. ఎయిర్​పోర్టులో ఘన స్వాగతం

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను, నిజామాబాద్​ జిల్లా పేరు ప్రతిష్టలను నిలబెట్టారని మంత్రులు కొనియాడారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫూట్ బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఇవ్వాల మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు..

క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు తెలంగాణకు గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల త్యాగం వీరి విజయం వెనుక ఉన్నాయని అన్నారు. ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితే తప్పా ప్రపంచ స్థాయిలో రాణించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, టూరిజం MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మి, డా హరికృష్ణ,వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement