Friday, March 29, 2024

ఎపిక్యాడ‌ర్ ఐఎఎస్, ఐపిఎస్ ల కొత్త పంచాయితీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సోమేష్‌ కుమార్‌ వ్యవహారం తర్వాత అదే కోవకు చెందిన మిగతా 13 మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల అధికారుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతోంది. హైకోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారం ఉన్నప్పటికీ బెంచ్‌పైకి రాలేదు. వచ్చే నాలుగైదు రోజుల్లోనే మరోసారి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేడర్‌పై తలె త్తిన వివాదం హైకోర్టు ముందుకు రానుంది. అప్పటివరకు వారిలో ఆందోళన తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమం లో వారి ముందు కొత్త పంచాయతీ చిక్కుముడిగా తయా రైంది. సోమేష్‌ కుమార్‌ తరహాలోనే ఈ కేసును కూడా వేర్వేరుగానే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అలాగైతే, తెలంగాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీ కేడర్‌ ఉద్యోగులంతా తప్పని సరిగా ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది.

మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో మాకు ముడిపెట్టవద్దంటూ హైకోర్టును ఆశ్రయించాలని 13 మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లంతా మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమ వారం తర్వాత వారంతా వేర్వేరుగా కోర్టులో పిటీషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ సహా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది రెగ్యులర్‌ బెంచ్‌. మొత్తం పిటిషన్లను కలిపి విచారించబోతోంది. 2017లో క్యాట్‌ ఆదేశాలను సవాలుచేస్తూ డీవోపీటీ- హైకోర్టును ఆశ్రయించింది. ఐదారేళ్ల విచారణ తర్వాత సోమేష్‌కుమార్‌ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు. అప్పటివరకు తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్‌ను తక్షణమే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. అయితే, తమ పిటిషన్లను సోమేష్‌ కేసుతో లింక్‌ పెట్టొ-ద్దని మిగతా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వాదిస్తున్నారు. ప్రతి కేసులోనూ క్యాట్‌ వేర్వేరు తీర్పులు ఇచ్చిందని హైకోర్టుకు ఇప్పటికే విన్నవించుకున్నారు. వేర్వేరు వివాదాలు, వేర్వేరు తీర్పులు ఉన్నందున ప్రతి పిటిషన్‌ను సెపరేట్‌గా విచారించాలంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement