Tuesday, October 8, 2024

New Staff – హైడ్రాలో కొత్తగా 169 మంది సిబ్బంది కేటాయింపు….

హైదరాబాద్ – హైడ్రాలో కొత్తగా 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల్లో.. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లును హైడ్రాకు కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement