Friday, April 26, 2024

టెంపుల్​ టూరిజం డెవలప్​మెంట్​కు కొత్త పాలసీ.. ఎర్​ఆర్​ఐలు సపోర్ట్​ చేయాలే: శ్రీ‌నివాస్ గుప్తా

తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజ్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు త్వ‌ర‌లోనే కొత్త‌పాల‌సీ తీసుకురాబోతున్నామ‌ని, దీనికి ఎన్ ఆర్ ఐ ల‌నుంచి స‌పోర్ట్ కావాల‌న్నారు టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా.. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఇవ్వాల (ఆదివారం) జరిగిన WE Vyshya MANAM 2022 -Hyderabad కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఆర్యవైశ్య వ్యాపార సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు అందరినీ ఒకే వేదిక పైకి తీసుకునిరావడం సంతోషంగా ఉంద‌న్నారు.. సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింద‌ని, తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతోంద‌ని కొనియాడారు. దీంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వినూత్నంగా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన‌ట్టు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)ను తేవ‌డంతో పరిశ్రమలకు చాలా ఈజీగా అనుమతులు ల‌భిస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా మ‌రోసారి అంద‌రి దృష్టికి తీసుకొచ్చారు.

పరిశ్రమలకు అవసరమైన అన్నింటినీ వేగ‌వంతంగా సమకూర్చుతుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయ‌ని చెప్పారు శ్రీ‌నివాస్ గుప్తా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింద‌ని, ముఖ్యంగా ఆర్యవైశ్యులలో న‌లుగురికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, ఒకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా కూడా చాన్స్ వ‌చ్చిన‌ట్టు గుర్తు చేశారు. అయితే.. ఆర్యవైశ్య పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవాలని ఈ సంద‌ర్భంగా కోరారు.

తెలంగాణలో టూరిజాన్ని ఒక హబ్ లాగా తీర్చి దిద్దుతున్నామని, టెంపుల్ టూరిజం బాగా డెవ‌ల్ అవుతోంద‌న్నారు గుప్తా. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో త్వరలో కొత్త పాలసీ తేబోతున్నట్టు చెప్పారు. అందుకు NRIలు కూడా సపోర్ట్ చేయాలని కోరారు. ఇండస్ట్రీస్ పెట్టేందుకు వచ్చే వారికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. కార్య‌క్ర‌మంలో శ్రీనివాసన్ ఏమరాల్డ్ సీఎండీ, జాగిల్ ఫౌండర్ రాజు & ఫణి, MLC బొగ్గారపు దయానంద్ , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఫౌండర్ అనిల్ గుప్తా, వి-వైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ పడకంటి అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ మొగుడం పల్లి శంకర్, తెలంగాణ కోర్ మెంబెర్ బొగ్గారపు వరుణ్, గ్లోబల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ భావన, బండారి సుబ్బారావు, రమేష్, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement