Friday, March 29, 2024

సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త! – కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ

హైదరాబాద్/వరంగల్, మార్చి 18:తెలంగాణ ప్రభుత్వం సెర్ఫ్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ఉద్యోగులకు శుభవార్త! తెలిపింది. సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా అనతి కాలంలోనే కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ ఎం ఎస్ నంబర్ 11 ను జారీ చేసింది. దీంతో 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి జీతాలు, వేతనాలు భారీగా పెరిగనున్నాయి. మొత్తం 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పే స్కేలు అమలులోకి రానున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు

.ఇదిలా ఉండగా సెర్ఫ్ ఉద్యోగులు, ఈ జీవో జారీ చేయించిన సీఎం కేసీఆర్, కాగా, serp ఉద్యోగుల కోరికను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, తమ డిమాండ్ సాకారం అయ్యే విధంగా కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

23 సంవత్సరాలుగా మిగతా రాష్ట్ర ఉద్యోగుల తరహాలో పెరగని నిర్ణీత నేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగాది కానుకగా తీపి కబురు చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో మార్చి 15న చేసిన ప్రకటన ప్రకారం సెర్ప్ ఉద్యోగులకు సవరించిన వేతనాలతో కూడిన కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 11 ను ఈరోజు విడుదల చేశారు. సంస్థలో పనిచేస్తున్న 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. దీంతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.58 కోట్ల అదనపు భారం పడనుంది

.ఇదిలాఉండగా, serp ఉద్యోగుల కోరికను మన్నించి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కలను నిజం చేసిన మనసున్న మహారాజు సీఎం కెసిఆర్, ఆర్థిక భారంగా ఆలోచించకుండా, బాధ్యతగా నిర్ణయం తీసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Serp ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Serp ఉద్యోగుల పే స్కేల్ సవరణ జీ ఓ రావడంతో ఆ ఉద్యోగుల ముఖాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి

ధన్యవాదాలు తెలుపుతూ SERP ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున పాలాభిషేకం కార్యక్రమాలు జరపడంతో పాటు మంత్రులకు ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నట్టు SERP ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు

.ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లో రాష్ట్ర జేఏసీ తరఫున ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, జానయ్య, వెంకట్, సురేఖలు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఎమ్మెల్సీ కవితకు స్టేట్ SERP ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement