Thursday, April 18, 2024

వరంగల్ కు ముప్పై మందితో కూడిన డి.ఆర్.ఎఫ్. బృదం

వరంగల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రేటర్ వరంగల్ మరోసారి జలదిగ్భందలోకి అయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగరంలోని పలు కాలనీలు జలదిగ్భందంలోకి వెళ్లాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారుల రంగంలోకి దించారు. అత్యవసర సమయంలో విధులు నిర్వర్తించే డి.ఆర్.ఎఫ్. బృదం వరంగల్ చేరుకుంది. 30 మంది సిబ్బందిని క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించేదుకు బల్దియా వాడుకోనుంది.

ఇప్పటికే డి.ఆర్.ఎఫ్. బృదంలోకి కొంత మందిని కరోనా మృతులను తరలించడం కోసం వరంగల్ బల్దియా వాడుతోంది. ఇక వర్షాకలం నేపథ్యంలో ఆపత్కాల పరిస్థితుల్లో, ఇతరత్రా ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడం కోసం మరింత ఈ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సహజ విపత్తులు, పరిస్థితులను ఎదుర్కొనడానికి 2 బోట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి, ప్రజలను సురక్షితం గా బయటకు తేవడానికి వీలుగా తగినంత రోప్(త్రాడు, ఇ-టైప్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయని, అత్యవసర సమయం లో ధరించడానికి వీలుగా 25 లైట్ జాకెట్ లు అందుబాటులో ఉన్నాయి..ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి డి.ఆర్.ఎఫ్. సిబ్బంది అందుబాటులో ఉంటుందని కమీషనర్ పమేల సత్పతి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement