Wednesday, March 27, 2024

అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు.. పరిశీలించిన కలెక్టర్..

నర్సంపేట నియోజకవర్గంలో గతరాత్రి నుండి కురుసిన‌ వర్షం, ఈదురు గాలుల కారణంగా కొన్ని గ్రామాల్లో ఇల్లు కూలిపోవడం, రోడ్లపై చెట్లు విరిగిపడి ప్రయాణికులకు అంతరాయం కలగడం, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని నియోజకవర్గ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న రాత్రి నుంచి వర్షం కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తూ స్వయంగా ముమ్మర చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాత్రి నల్లబెల్లి మండలం మేడిపల్లి, రాంపూర్ గ్రామాల్లో పర్యటించి ఈదురు గాలులకు ఇండ్లు కూలిపోయిన వారిని పరామర్శించి తక్షణ సాయంగా వారిని ఆదుకోవడం జరిగింది.

ఈరోజు ఉదయం వర్షంలోనే దుగ్గొండి మరియు కానాపురం మండలాల్లో పర్యటించి పంటనష్టాన్ని పరిశీలించారు. ప్రకృతి వైపరిత్యాల కారణంగా జరిగిన నష్టం గురించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ గోపి మరియు ఉన్నతాధికారులు బృందంతో నియోజకవర్గంలో తీవ్రంగా పంట నష్టం జరిగిన ఇటుకాల పల్లి చుట్టూ పక్కల తండాలతో పాటు, మేడేపల్లి, నరసింగా పూర్, కొండాయిల పల్లె, గ్రామాల్లో పర్యటించి బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించి రైతులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా వర్షం ఇదే మాదిరిగా కొనసాగితే ఎప్పటికప్పుడు నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తూ సమాచారం అందించాలని, తక్షణ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకునే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో నర్సంపేట రూరల్ మరియు నల్లబెల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, రెవెన్యూ మరియు వ్యవసాయాధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement