Saturday, April 20, 2024

న‌కిరేక‌ల్ మునిసిపాలిటి – ఏడు వార్డుల‌లో టి ఆర్ ఎస్ విజ‌యం…

నకిరేకల్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్‌ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్‌ పురపాలికలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. తొలి రౌండ్‌లో 12, రెండో రౌండ్‌లో 8 వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

1వ వార్డ్‎లో స్వతంత్ర అభ్యర్థి కందాల బిక్షం రెడ్డి గెలుపు
2వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ సునీల్ విజయం

4వ వార్డ్‎లో కాంగ్రెస్ అభ్యర్థి గాజుల సుకన్య గెలుపు

5వ వార్డ్‎లో ఏఐఎఫ్‎బీ లయన్ అభ్యర్థిని వంటపాక సోమలక్ష్మీ విజయం

7వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి కొండ శ్రీను గెలుపొందారు.

- Advertisement -

8వ వార్డ్‎లో ఏఐఎఫ్‎బీ లయన్ అభ్యర్థి పన్నాల పావని శ్రీనివాస్ విజయం
10వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి చవుగోని అఖిల విజయం సాధించారు.
11వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి మురారిశెట్టి ఉమారాణి గెలుపొందారు.
13వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థిని పోతుల సునీత రవి గెలుపు.
15వ వార్డ్‎లో ఏఐఎఫ్ బీ లయన్ అభ్యర్థిని యాసారపు లక్మీ విజయం సాధించారు.
17వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజయ్ గెలుపొందారు.19వ వార్డ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ శ్రీను విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement