Saturday, July 24, 2021

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ(70) అనే వృద్ధురాలు మరణించింది. వృద్ధురాలి మృతిని నిరసిస్తూ గ్రామస్థులు హైవేపై ఆందోళన చేపట్టి.. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. అండర్‌పాస్ బ్రిడ్జి లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల ఇరువైపులా 2 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. నిరసనకారులతో చౌటుప్పల్ ఏసీపీ చర్చలు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: ఆ బిల్లు పార్లమెంట్‌లో వచ్చిన రోజు దేశమంతా అంధకారమే

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News