Friday, May 20, 2022

మెడికల్ హబ్ గా సూర్యాపేట : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట : సూర్యాపేట‌ జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారిందని, జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వైద్య వ్ర్రత్తిలో నర్సుల పాత్ర ప్రధానమైనదని ఆయన అన్నారు. ఏ రకమైన శస్త్రచికిత్స చేయాలన్నా నర్సుల సేవలు అవసరమని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం H 1ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట మెడికల్ కాలేజ్ మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, పీజీ సీట్లకు కూడా త్వరలోనే అనుమతి వస్తుందన్నారు. మెడికల్ కాలేజ్ భవనాల నిర్మాణం పూర్తి అయిందని, త్వరలోనే ప్రారంభం జరగనుందన్నారు. సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కళాశాల మంజూరు చేసిందని ఆయన అన్నారు. త్వరలోనే ఆసుపత్రి భవనం, నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని చెప్పారు. నర్సులు ప్రతిరోజూ యాక్సిడెంట్ కేసులు, వివిధ రకాల వ్యాధులతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ డెలివరీల సంఖ్య పెరిగిందని, జిల్లాలో 56శాతం సాదారణ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం నర్సులందరికీ మంత్రి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటా చలం, హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, హెచ్ 1 ఉద్యోగుల సంఘం నాయకులు భూతరాజు సైదులు, సుదర్శన్, వాంకుడోతు వెంకన్న, మధు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వి, జెడ్ పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మది భిక్షం, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement