Sunday, March 26, 2023

కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు, రుణాలు రాకుండా మోకాలు అడ్డుతుండ్రు అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిప‌డ్డారు. సూర్య‌పేట‌ జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర జనాభాలో 60% కుటుంబాలకు ఆసరా ఫించన్లు ఇచ్చామని, మోడీ సొంత రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్నది 20 శాతం కుటుంబాలేనని అన్నారు. మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలేనని చెప్పారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇచ్చేది 600 రూపాయలేనన్నారు. డబుల్ ఇంజిన్లకు తెలంగాణా ఫించన్లు ట్రబుల్ ఇస్తున్నాయి. ప్రజలు తిరగబడతారన్న భయం బీజేపీని వెంటాడుతుందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement