Saturday, May 28, 2022

నల్గొండ జిల్లాలో నరబలి.. దొరికిన మొండం..

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని విరాట్‌నగర్‌ మెట్టు మహంకాళి పాదాల వద్ద లభ్యమైన తలకు సంబంధించిన మొండెం దొరికింది. గురువారం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కమ్మగూడలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద తల లేని మొండెం లభించింది. తలను గుర్తించి నాటి నుంచి తీవ్రంగా గాలించగా, మూడు రోజుల తర్వాత పోలీసులు మొండాన్ని కనిపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మొండెంను ఆసుపత్రికి తరలించారు. మొండెం ఉబ్బి దుర్వాసన వస్తుండటంతో మూడు రోజుల క్రితం ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంటి నిర్మాణం కొన్నాళ్ళుగా నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న ఇటుకల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా మొండెంను పెట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన తలకాయకి చెందిన వ్యక్తి తుర్కయాంజాల్‌ పరిసర ప్రాంతంలోని ఆలయాల్లో భిక్షాటన చేసేవాడని సమాచారం. ఇక్కడే హత్య చేసి అక్కడకి తలను తీసుకుని వెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement