Wednesday, April 14, 2021

నాగార్జున‌సాగ‌ర్ పై మావోల క‌న్ను.. త‌నిఖీలు ముమ్మ‌రం చేసిన పోలీసులు..

న‌ల్గొండ‌ : రాష్ట్రంలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్‌ నియోజకవర్గంపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. తాండాలు, గూడాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంపై పట్టు కోసం అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. నేత లందరూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, గూడెలు, తండాలకు వెళ్తుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. మావోయిస్టులు ఏ క్షణం‌లో ఎక్కడ దాడికి సిద్ధమైన సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. కొన్నాళ్ళు గా తెలంగాణలో పట్టుకోసం ప్రయ త్నిస్తున్న మావోయిస్టులు ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్రంపై తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం గా ఉన్నారన్న సమాచారం కొంత కాలంగా నిఘా వర్గాలకు అందు తూనే ఉన్నాయి. నాగార్జునసాగర్‌ లో ప్రజా ప్రతినిధులు, నేతలు, ఎన్నికల అధికారులు విస్తృతంగా తిరుగుతున్న నేపథ్యంలో మావోలు ఏమైన ఘాతుకానికి పాల్పడవచ్చన్న అనుమానంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కొంత మంది నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారు. స‌రైన భ‌ద్ర‌త లేకుండా ఎన్నిక‌ల ప్రచారానికి వెళ్ల‌వ‌ద్ద‌ని నేత‌ల‌ను కోరారు…రాత్రి పూట గ్రామాల్లో, తండాలో ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Prabha News