Thursday, April 25, 2024

సాగ‌ర్ ఉప ఎన్నిక ‌- సీఎం కెసిఆర్ సభకు లైన్‌క్లియర్‌

రేపు హాలియాకు కేసీఆర్‌
ఎల్లుండితో ప్రచారానికి తెర
అంతా తానై ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీష్‌
సాగర్‌లో బండి సంజయ్, విజయశాంతి ప్రచారం
జానాకు మద్దతుగా ఉత్తమ్‌, రేవంత్‌, కోమటిరెడ్డి ప్రచారం

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో భాగంగా హాలియాలో సీఎం కేసీఆర్‌ ఈనెల 14న తలపెట్టిన ఎన్నికల బహిరంగ సభకు అడ్డంకులు తొలగిపో యాయి. కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న సభను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారిచేందుకు హైకోర్టు నిరాకరించింది. రోస్టర్‌ ఉన్న బెంచ్‌కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. కేసీఆర్‌ సభ బుధవారం కావడంతో దీనిపై విచారణకు అవకాశం లేకుండాపోయింది. ఇక సీఎం సభకు అడ్డంకులు తొలిగినట్లేనని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంటున్నాయి. సభను రద్దు చేయాలంటూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్‌ స్వతంత్ర అభ్యర్థి సైదయ్య సభ నిర్వహించే భూముల రైతులు పిటిషన్లు వేశారు. మరోవైపు సీఎం సభ రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్‌ ఫిర్యాదు చేశారు.
ప్రచారహోరు
ఈనెల 17న జరిగే నాగార్జునసాగర్‌ బైపోల్‌ కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ప్రచారబరిలోకి దిగుతున్నారు. ఈనెల 14న హాలియా శివారులో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొనే సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేసు ్తన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి రవీందర్‌రావు తదితరులు సోమవారం ఏర్పాట్లు పర్యవేక్షించారు. పెద్దవూర మార్గంలోని 20 ఎకరాల ఖాళీ స్థలంలో ఈ సభను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాగర్‌ నలుమూలల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. పార్కింగ్‌ కోసమే 30 ఎకరాలను కేటాయించారు. ఈనెల 17న ఉప ఎన్నిక జరగనుండగా, 15వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగి యనుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఒకరోజు ముందు కేసీఆర్‌ సభకు ప్లాన్‌ చేశారు. సాగర్‌ ఉపఎన్నికకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని, సభతో పార్టీలో ఫుల్‌జోష్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌ సీటును కాపాడు కునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఎన్నికల ఇంఛార్జీలుగా వ్యవ హరిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిబంధనల మేరకు సభ నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. సభకు వచ్చే వాళ్లంతా తప్ప కుండా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
మాటలతూటాలు
మొదటి నుంచీ నాగార్జునసాగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచు కోటగా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఇక్కడి నుంచి అనేకసార్లు విజయఢంకా మోగించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మళ్లి సాగర్‌ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ వ్యూహా త్మకంగా ముందుకువెళుతోంది. ప్రముఖ నేతలంతా అక్కడే ఉండి ప్రచారం నిర్వ హిస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికలో డబ్బు, మద్యం పారిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడుతున్నారు. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి నాగార్జునసాగర్‌ స్థానంలో విజయబావుటా ఎగురవేసిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు నోముల భగత్‌ను రంగంలోకి దించి ప్రచారం జోరు పెంచింది. మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌ సహా టీఆర్‌ఎస్‌ ప్రముఖ నేతలంతా సాగర్‌పై ఫోకస్‌ పెట్టి పనిచేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌, సినీనటి విజయశాంతి ప్రచారం నిర్వ హించారు. ప్రచారంలో మాటలతూటాలు పేల్చారు. మూడుపార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహిస్తుండగా, మందకృష్ణ కూడా అక్కడే మకాం వేసి సొంత అభ్యర్ధి తరుపున ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement