Friday, March 29, 2024

ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆస్ట్రేలియా చెక్కేశారు. పైగా కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డే గెలవాలనే కోరుకుంటున్నారు వెంకట్ రెడ్డి. తన సొంత పార్టీ గురించి ఏమాత్రం ఆలోచించనట్లుగా తెలుస్తోంది వెంకట్ రెడ్డి వ్యవహారం. మునుగోడులో ప్రచారం మానేసి ఆస్ట్రేలియా వెళ్లటం ఒకటైతే అక్కడినుంచి ఆయన వీడియోల ద్వారా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. తన తమ్ముడు రాజగోపాల్ కే ఓట్లు వేయాలని చెప్పటం కాంగ్రెస్ లో కల్లోలం కలిగిస్తున్న క్రమంలో.. అవసరమైతే రాజకీయల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసి.. ఇప్పుడు ఎంపీగా ఉన్నా..అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మునుగోడులో ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోవటం గురించి కాంగ్రెస్ పార్టీనుంచి పలు అసంతృప్తులు వస్తున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు.. ఆయన కూడా ఇక వేరే పార్టీకి వెళ్లిపోతారంటూ అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement