Thursday, April 25, 2024

ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలి : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ఈనెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల‌ని, ఈ సభ దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుంది మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ… నరేంద్ర మోడీ దుర్మార్గపు పాలన చేస్తుండు.. అడిగే వారే లేరు అన్నట్లు మోడీ అహంకారంతో ఉన్నాడ‌న్నారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల్లో తీవ్ర వివక్ష ఉంద‌ని, తెలంగాణ బాగుపడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుపడుతున్నాడు అన్నారు. తెలంగాణను విద్యుత్ వెలుగులు వెదజిల్లే విధంగా కేసీఆర్ బాగు చేశార‌న్నారు. బీఆర్ఎస్ కు దేశ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే, దేశం మొత్తం అన్నదాతలకు ఉచిత విద్యుత్ అందుతుంద‌న్నారు. దేశానికే అన్నపూర్ణ గా నిలిచింది మన తెలంగాణ.. దేశ ప్రజల కోరిక మేరకు కేసీఆర్ BRS పార్టీ ప్రారంభించడం జరిగింద‌న్నారు. BRS పార్టీ మొట్టమొదటి బహిరంగ సభ ఖమ్మంలో జరుగుతుంది. దీనికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాల‌న్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, పలువురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. బీజేపీ ద్వంద విధానాలను సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండ గడుతార‌న్నారు. ఈ స‌మావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement