Tuesday, September 26, 2023

ఇంట‌ర్ ఫ‌లితాలు.. సూర్యాపేట జిల్లాలో బాలికలదే హ‌వా..

సూర్యాపేట, ప్రభ న్యూస్ : ఈరోజు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా మొదటి సంవత్సరం ఫలితాలలో 51 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 26వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 6518 మంది విద్యార్థులు హాజరు కాగా 3333 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 44% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 56% ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 59% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రస్థాయిలో 31 స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6345 మంది పరీక్షకు హాజరు కాగా 3764 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలురు 49% బాలికలు 67% ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement