Saturday, November 9, 2024

NLG: మోత్కూర్ లో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్…

స్టేషన్ కు తరలింపు
మోత్కూర్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్ ) రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పోలీసులు అక్రమ అరెస్టు , హౌస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపుమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులను వారి ఇండ్లలోకి వెళ్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.

ఎస్సై దొమ్మినేటి నాగరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ నరసింహ, పోలీస్ సిబ్బంది బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, జంగ శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ యాకూబ్ రెడ్డి, రైతుబంధు మాజీ అధ్యక్షులు కొండ సోoమల్లు, నాయకులు గజ్జి మల్లేష్, కూరేళ్ల పరమేష్, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, అన్నoదాస్ విద్యాసాగర్, జంగ శివ, బందెల శీను తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement