Sunday, November 10, 2024

TG | మా బతుకులు ఆగం చెయ్యొద్దు..

  • ముక్తకంఠంతో వ్యతిరేకించిన గ్రామస్తులు
  • అన్ని కాలుష్యమయమే..
  • అదానీ గోబ్యాక్ అంటూ నినాదాలు


ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : ఇప్పటికే మూసీతో కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాం.. పచ్చని పంట పొలాల్లో అదానీ సిమెంట్ ప్యాక్టరీ పెట్టి చిచ్చురేపకండి.. శబ్దం, వాయు, జల కాలుష్యంతో మా బతుకులు ఆగం చేయకండి అంటూ రామన్నపేట మండల ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు.

గతంలో డ్రై ఫోర్ట్ పెడతామని భూములు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ చెప్పగా.. గ్రామస్తులు మాట్లాడనివ్వలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో కంపెనీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement