Friday, September 22, 2023

అనిల్ కుమార్ కు పథకాల పంట.. అభినందించిన కమిషనర్ డీఎస్ చౌహాన్

ప్రభన్యూస్ ప్రతినిధి/యాదాద్రి : ఆలిండియా మాస్టర్ గేమ్స్ లో అథ్లెటిక్స్ లో యాదాద్రి భువనగిరికి చెందిన భువనగిరి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంబొజు అనిల్ కుమార్ పథకాలు సాధించారు. ఇటీవల ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్ లో జరిగిన పోటీల్లో రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ తన కార్యాలయంలో అభినందించారు. మే 12 నుండి 20 వరకు జరుగనున్న ఆసియా పసిఫిక్ మాస్టర్ గేమ్స్ లో అథ్లెటిక్స్ 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగులో పాల్గొనడానికి అర్హత సాధించిన అనిల్ కుమార్ ను కమిషనర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు డీసీపీ హనొక్ జయకుమార్, రిజర్వ్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement