Sunday, December 10, 2023

కారు బోల్తా : ఒక‌రు మృతి, ముగ్గురికి గాయాలు

కారు అదుపు త‌ప్పి బోల్తాప‌డ‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో టాటా ఇండిగో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన అంబటి భావనారుషి, గీత దంపతులు చిన్న కూతురు కార్తిక (2) అక్కడికక్కడే మృతి చెంద‌గా, పెద్ద కూతురు అమూల్య, భావన రుషికి స్వల్ప గాయాలవ్వగా భార్య గీతకి తీవ్రంగా గాయపడింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement