Wednesday, March 27, 2024

యాదగిరిగుట్ట డిపో RTC ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు

యాదగిరిగుట్ట డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందారని డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలియజేశారు. ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన వేడుకలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.డి. సజ్జనార్ విజేతలకు ప్రశంషా పత్రాలు అందజేశారు.

వారిలో నల్లగొండ రీజియన్ ఉత్తమ గ్యారేజి సూపర్ వైజర్ గా D.చందర్ AE(Mech), 100 రోజుల ఛాలెంజ్ నందు అత్యధిక సార్లు ఇంసెంటివ్ తీసుకున్న వారిలో జె.మల్లేష్ కండక్టర్ (50 సార్లు), ఎస్.యాదయ్య టీమ్ డ్రైవర్ (42 సార్లు), అత్యధిక ఇంధనం 233 లీటర్ల పొదుపు చేసినందుకు జె.రామలింగం డ్రైవర్ కు, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లో భాగంగా ఒక్క రోజు అత్యధిక ఆదాయం తీసుకొని వచ్చిన జోడీ పి.రోమన్ కండక్టర్, ఉపేందర్ డ్రైవర్, పి.గణేష్ టీమ్ డ్రైవర్ ఎన్నికైనారు. డిపోలో ఉత్తమ మెకానిక్ గా SK.బిక్కిన్ సాహెబ్, ప్రయాణికులు బస్సుల్లో మరిచిపోయిన విలువైన వస్తువులతో పాటు నగదును తిరిగి వారికి అందజేసిన డ్రైవర్లు G.R.మోహన్, K.దశరథ, R.శ్రీనివాస్, K.జగదీష్, SK.హుస్సేన్ బాబా, డ్రైవర్లకు ప్రశంషా పత్రాలు అందజేసినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement