Thursday, April 25, 2024

సాగ‌ర్ న‌యా స‌వాల్ …. కోవ‌ర్ట్ లు..

నాగార్జునసాగర్‌ రాజకీయం ఆసక్తికరంగా మారగా, మరోవారంలో ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్‌ జరగనుంది. ఈ సమయంలో.. ప్రధాన పార్టీలు తమ పార్టీలో అసంతృప్తులు, నమ్మకంగా వ్యవహరిస్తూ పక్కవారికి సమాచారం చేరవేసేదెవరు? సహకరించేది ఎవరు? అని ప్రత్యేక నిఘా బృందాలను నియమించుకున్నాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కోవర్టులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టికెట్‌ దక్కని అసంతృప్తులు సరిగా పని చేస్తున్నారా, లేదా అనే అనుమానంతో వారిపై నిఘా పెట్టాయి. సొంత పార్టీకి ప్రచారం చేయకపోయినా.. ఎదుటి పార్టీకి సహకరించకూడదని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు ప్రధాన పార్టీ నుంచి ఓ నేత టికెట్‌ ఆశించగా, ఎన్నో తర్జనభర్జనల అనంతరం పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్‌ కేటాయించింది. అప్పటి నుంచి ఆ నాయకుడు అంటీముట్టనట్లుగా
(మొదటిపేజీ తరువాయి)
ఉంటున్నాడు. తనకున్న అసంతృప్తి కారణంగా ఇతర పార్టీకి చెందిన నాయకుడికి సహకరించేందుకు సిద్ధమయ్యా డు. ఏకంగా ప్రత్యర్థి పార్టీ రాష్ట్ర నేతతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇది జరిగిన కాసేపటికే ఇలాంటివి మానుకోవాలని సొంత పార్టీ నుంచి ఆ నేతకు ఫోన్‌ వచ్చింది. ఇష్టం లేకపోయినా అసంతృప్త నాయకుల కు సొంత పార్టీ నేతలతో తిరగక తప్పడం లేదు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉప ఎన్నికలో సాక్షాత్కరిస్తున్నాయి. ఓ వైపు ప్రచారం ముమ్మరం గా కొనసాగిస్తూనే మరోవైపు కోవర్ట్‌లు ఎవరు.. హ్యాండిచ్చేదెవరు అన్న అంశాలపై ఆరా తీస్తున్నాయి.
ప్రతి ఓటు కీలకం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో ప్రతి ఓటును రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. సొంత ఓట్లు చేజారకుండా దృష్టి పెట్టాయి. పార్టీలోని అసంతృప్తవా దుల నుంచి ఓటర్లు చేజారకుండా నిరంతరం నిఘా పెట్టారు. అడుగు తీసి అడుగు వేస్తే ఏం చేస్తున్నారనే ది.. నిమిషాల్లొనె సొంత పార్టీ నేతలకు తెలిసిపోతోంది. ఎవరెవరు ఏం చేస్తున్నా రు.. ప్రచారంలో సహకరిస్తున్నారా? తమ పార్టీకి ఓట్లు వేసేందుకు క్షేత్రస్థాయి నేతలతో సమన్వయం చేస్తున్నారా? లేదా అనే కోణంలో సదరు నేతల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలతో బయట నేతల తీరుపై కూ డా నిఘా కొనసాగుతోంది.
నిఘా నీడన
టీఆర్‌ఎస్‌, బీజేపీల నుండి టికెట్‌ ఆశిం చిన వారి సంఖ్య చాలా ఉంది. వారందరినీ సముదాయించిన అధిష్టానాలు తప్పని పరిస్థితుల్లో ఇప్పటి అభ్యర్థులను బరిలోకి దింపినట్లు ప్రకటించాయి. టికెట్‌ దక్కని వారికి భవిష్యత్తులో మంచి పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చాయి. కానీ ఎమ్మెల్యే టికెట్‌ లేకుండా ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో.. ఒక పార్టీలో ఒకరు.. మరో పార్టీలో ఇద్దరు ఆశావహులు అంటీము ట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు.. వీరిని మొదటి నుంచి నిఘా నీడలోనే ఉంచాయి. నేతలతో పాటు కొన్ని మండలాలు, గ్రామాల్లో వారి అనుచరగణం కూడా హ్యాండిస్తున్న అంశాన్ని గుర్తించి ఎప్పటికపుడు కట్టడి చేస్తున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా కూడా.. ప్రత్యర్ధులకు ఏమైనా సహకరించే అవకాశముందా అని సొంతపార్టీలోని అసంతృప్తులపై మూడు పార్టీలు కన్నేసి ఉంచాయి. ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూడు ప్రధానపార్టీలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement