Tuesday, October 3, 2023

కోదాడలో 117కిలోల గంజాయి పట్టివేత..

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో భారీగా గంజాయి పట్టుబడింది. 117 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ఇద్దరు వ్యక్తులు కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement