Saturday, November 30, 2024

Musi Tour – మరికొద్దిసేపట్లో యాదాద్రి లో రేవంత్ రెడ్డి

యాదాద్రి – నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేయనున్నారు. దీనిలో భాగంగా . ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు.

10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శంచుకొని, పూజ చేస్తారు. 11.30కి యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు.మధ్యాహ్నం 1.30కి రోడ్డు మార్గంలో సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. ఇది పాదయాత్ర. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది.

అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కి బయలుదేరతారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement