Wednesday, April 24, 2024

మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద..ఏడు గేట్లు ఎత్తివేత

తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భారీగా వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. దీంతో, ఏడు గేట్లను అడుగు మేర ఎత్తివేసి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ, ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేయడం వల్ల మూసీ నదిలో ప్రవాహం పెరిగిందని, దీనివల్ల నది పరీవాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,500 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 4,400 క్యూసెక్కులుగా ఉంది.

ఇది కూడా చదవండి: ఆ గ్రామంలో ఆరు రోజుల పాటు నిద్రపోతారట..లేచాక ఆ పని తప్పనిసరి..

Advertisement

తాజా వార్తలు

Advertisement