Saturday, December 7, 2024

WGL | గుర్రంపేట‌లో మ‌హిళ హ‌త్య‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, వెంక‌టాపూర్ (జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా) : ములుగు జిల్లా గుర్రంపేటలో శ‌నివారం మేక‌ల కాప‌రి హ‌త్య‌కు గురైంది. గుర్రంపేట గ్రామానికి చెందిన మేక‌ల కాప‌రి సకినాలా సరస్వతి (35) భ‌ర్త కొంత కాలం కింద‌ట మృతి చెందారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు రాకేష్ వేరే చోట ఉంటున్నారు. ఆమె ఒంట‌రిగా ఉంటూ త‌డుక ర‌వికి చెందిన మేక‌ల‌కు కాప‌రిగా ఉంటూ జీవ‌నం సాగిస్తుంది. మేక‌ల కొట్టం శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇత‌ర కాప‌రుల‌కు ర‌క్త‌పు మ‌డుగులో స‌ర‌స్వ‌తి నిర్జీవంగా ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించి గ్రామ‌స్థుల‌కు స‌మాచారం ఇచ్చారు.

ములుగు పోలీసుల ద‌ర్యాప్తు…
గ్రామ‌స్థుల స‌మాచారం మేర‌కు ములుగు సిఐ శంకర్, ఎస్సై సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.హత్యకు గల కారణాలు, నిందితుల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి సోదరుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శంకర్ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement