Friday, October 4, 2024

KHM: గోవింద్రాలలో గిరిజన యువకుడి హత్య..

కామేపల్లి, సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్) : దివ్యాంగ గిరిజన యువకుడు హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని గోవింద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గోవింద్రాల గ్రామానికి చెందిన బావ్ సింగ్ (జగన్) (30) దివ్యాంగుడు. తల్లిదండ్రులు లేకపోవడంతో తన అక్క దగ్గర ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

అయితే గురువారం రాత్రి మద్యం తాగేందుకు ముగ్గురు యువకులు కలిసి బావ్ సింగ్ ని తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే బావ్ సింగ్ హత్యకు గురైన సంఘటన తెలుసుకున్న పోలీసులు ఖమ్మం నుండి ప్రత్యేక నిఘా బృందాలను పిలిపించి హత్యకు గల కారణాలు, హత్యకు పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement