Wednesday, June 7, 2023

మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పిన ప్రజలు… తమ్మినేని

మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ బలపర్చిన అభ్యర్థిని 10వేల మెజార్టీతో గెలిపించారన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఇళ్లస్థలాలివ్వాలని సీఎంను కోరారు. త్వరితగతిన పోడు భూములకు పట్టాలివ్వాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement