Wednesday, November 27, 2024

TG| ఏసీబీ వలలో ఇంచార్జ్ మున్సిపల్ ఆర్ఐ

రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఆర్ఐ షాకీర్ ఖాన్


నిర్మల్ మున్సిపాలిటీలో ఇంచార్జ్ ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్న షాకీర్ ఖాన్ రూ.15000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డాడు. మున్సిపల్ కార్యాలయంలో ఇదే శాఖలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చందుల భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టించాడు.

భరత్ చెప్పిన వివరాల ప్రకారం… గత రెండు నెలలుగా తన ఉద్యోగం రెగ్యులర్ కోసం డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. మొదట రూ.20000లు డిమాండ్ చేయగా రూ.15వేలు ఇచ్చేందుకు అంగీకరించాడని పేర్కొన్నారు. తను మనస్థాపానికి గురై ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి. సీఐలు కృష్ణకుమార్, కిరణ్ రెడ్డిలతో పాటు వారి సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement