Thursday, November 28, 2024

KTR | మిస్ట‌ర్ చీప్ మినిస్ట‌ర్.. తెలంగాణ ఉన్నంత‌కాలం కేసీఆర్ ఉంటారు

  • యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ కామెంట్స్ కు కేటీఆర్ ఫైర్
  • పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే ఆయ‌న ప‌దవినే వ‌దిలేశారు
  • నువ్వు టిక్కెట్ లాబీయింగ్ చేస్తున్న‌ప్పుడు స్వ‌రాష్ట్రం అంటూ నిన‌దించారు
  • పిచ్చి ప్ర‌చారం, దుర్బాష‌లాడినా కేసీఆర్ ను క‌నుమ‌రుగు చేయ‌లేరు

హైద‌రాబాద్ – యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటార‌ని, ఆ పేరును ఎవరూ చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్ట‌ర్ ‘చీప్’ మినిస్ట‌ర్ రేవంత్ అని చుర‌క‌లంటించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

నువ్వు స్లిప్ప‌ర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే.. ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశాడని కేటీఆర్ పేర్కొన్నారు. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడని కేటీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు… ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు ‘డబ్బుల బ్యాగులు’ ప‌ట్టుకున్నప్పుడు.. సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ఆయన ఈ రాష్ట్రానికి గర్వకారణం. నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement