Wednesday, March 27, 2024

మినీటాంక్ బండ్‌పై వాహనదారుల ఇష్టారాజ్యం.. పాదచారులకు ఇబ్బందులు, కొరవడిన నిఘా

సూర్యాపేట, (ప్రభ న్యూస్): సూర్యాపేట ప‌ట్ట‌ణంలోని మినీ టాంక్ బండ్‌పై ద్విచక్ర వాహనదారులు ఇష్ట‌మున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వారి ఆగ‌డాల‌తో పాదచారులు బెంబేలెత్తుతున్నారు. టాంక్ బండ్ పై వాహనాలు తిరగవద్దని ఆంక్షలు ఉన్నా అవేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పాద‌చారులు వెళ్తుంటే వారిపికై దూసుకొస్తూ.. ఇష్టానుసారంగా కటింగ్ లు ఇస్తున్నారు. అంతే కాకుండా కట్టపై బర్త్ డే పార్టీలు నిర్వ‌హిస్తూ, కేక్ కట్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. టాంక్ బండ్ పైకి వాహ‌నాల‌తో వ‌స్తున్న వారిని అడ్డుకోవాల‌ని, ఇష్ట‌మున్న‌ట్టు తిరుగుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాద‌చారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement