Friday, March 29, 2024

మమతా గెలిచిందని మోదీ రాజీనామా చేస్తారా?: బండికి కవిత కౌంటర్

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలన్న బండి సంజయ్ సవాల్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆమె అన్నారు. ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్న కవిత.. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత గుర్తు చేశారు. బెంగాల్ లో మమతా బెనర్జీ గెలిచిందని కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది కదా? అని అడిగారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదని కవిత వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement