Saturday, April 20, 2024

లింక్ రోడ్ల అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ సమీక్ష

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టనున్న లింక్ రోడ్ల అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద హెచ్.ఆర్.డి.సీ.ఎల్. అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిన దిన వేగంగా అభివృద్ధి చెందుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చేపట్టవలసిన లింక్ రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఇందులో భాగంగా ప్రగతి నగర్ నుండి వయా మహదేవపురం వెటర్నరీ హాస్పిటల్, ఎల్లమ్మ బండ.., బాచుపల్లి వికాస్ స్కూల్ నుండి గోకరాజు రంగరాజు కాలేజి.., నిజాంపేట్ వీఎన్ఆర్ కాలేజీ నుండి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ.., బాచుపల్లి నుండి వయా ఆర్జికే డబల్ బెడ్ రూం.., సుభాష్ నగర్ రామ్ రెడ్డి నగర్ నుండి ఫాక్స్ సాగర్ మీదుగా ఎన్.హెచ్ 44.., కుత్బుల్లాపూర్ రోడ్డు నుండి పైప్ లైన్ రోడ్డు వయా గోదావరి హోమ్స్.., కుత్బుల్లాపూర్ రోడ్డు నుండి పైప్ లైన్ రోడ్డు వయా సెయింట్ అంథోనిస్ హైస్కూల్ వెన్నెల గడ్డ చెరువు.. ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు లింక్ రోడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

అదే విధంగా మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ ఫేస్-2లో భాగంగా బాచుపల్లి నుండి నిజాంపేట్ (వికాస్ స్కూల్) 1.7 కిలోమీటర్లు, బాచుపల్లి నుండి నిజాంపేట్ రోడ్డు 1.6 కిలోమీటర్ల ఏర్పాటుకు మంజూరైన రూ.36.3 కోట్లతో పనులు వేగంగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ సర్దార్ సింగ్, ఈఈ రాయ్ మల్, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement